Shruti Haasan: ఇతరులతో నన్ను పోల్చితే నాకు నచ్చదు!

  • January 30, 2024 / 04:56 PM IST

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే శృతిహాసన్ ఇటీవల ప్రభాస్ సరసన నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇకపోతే ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్ హీరో హీరోయిన్లతో పోటీ పడటం లేదని తెలిపారు. ఎందుకంటే నేను 11 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా సినిమాలలో నటించానని తెలిపారు. అప్పట్లో నేను చేసిన ఇంటర్వ్యూలను కనుక చూస్తే నేను ఎక్కువగా పాన్ ఇండియా అనే పదం ఉపయోగించానని శృతిహాసన్ తెలిపారు.

అందుకే నాకు పాన్ ఇండియా ఫీవర్ లేదని, నేను అన్ని భాష సినిమాలలో నటించానని తెలిపారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి హీరో హీరోయిన్లతో నేను నన్ను పోల్చుకోలేను ఎందుకంటే నన్ను ఇతరులతో పోల్చడం నాకు ఏమాత్రం నచ్చదని ఈమె తెలిపారు. ఇక ప్రస్తుతం శృతిహాసన్ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ హిందీ తమిళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె హీరో అడివి శేషు తో కలిసి డేకాయిట్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతోపాటు ఇంగ్లీష్ మూవీ అయినటువంటి చెన్నై స్టోరీస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల గురించి (Shruti Haasan) శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus