సైలెంట్ గా వెబ్ ఫిలిం తీసేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్..!

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో సైలెంట్ గా ఓ క్లాస్ హిట్ ను అందుకుని ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఆ తరువాత ‘మహానటి’ చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్నాడు. అక్కడితో ఆగలేదు..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఏకంగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని అనౌన్స్ చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా.. హాట్ టాపిక్ గా మారాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘ఆదిత్య 369’ వంటి విజువల్ వండర్ ను మనకు అంధించిన దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెంట‌ర్‌గా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు వెల్లండించారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలుకావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి.. ఈ గ్యాప్లో సైలెంట్ గా ఓ వెబ్ ఫిలిం ను తీసేస్తున్నాడట నాగ్ అశ్విన్. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘నెట్ ఫ్లిక్స్’ వారి కోసం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శృతీ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తుందట.

హైద‌రాబాద్‌లోని సార‌థి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ కూడా మొద‌లుపెట్టారట.30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిలింలో శృతిహాస‌న్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus