గెస్ట్ రోల్ అయినా ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే!

బాలీవుడ్ హిట్ సినిమా ‘పింక్’ ని ‘వకీల్ సాబ్’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా.. ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు. నిజానికి కథ ప్రకారం ఈ సినిమాలో పవన్ పాత్రకి హీరోయిన్ అవసరం లేకపోయినా.. అతడి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ తో చిన్న ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనికోసం దాదాపు పదిరోజుల పాటు వర్క్ ఉంటుందట.

ఈ సినిమాలో పవన్ కి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. పది రోజుల పాటు నటించాల్సిన పాత్రే అయినప్పటికీ తనకు ‘క్రాక్’ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో అంతే ఇవ్వాలని శృతి డిమాండ్ చేసిందట. సాధారణంగా అయితే తక్కువ రోజుల వర్క్ ఉండే సినిమాలకు హీరోయిన్లు కాస్త రిబేట్ ఇస్తుంటారు. సినిమాలో ఏదైనా స్పెషల్ సాంగ్ చేయాల్సి వస్తే మాత్రం బాగా డిమాండ్ చేస్తారు. కానీ ‘వకీల్ సాబ్’ సినిమాలో అతిథి తరహా పాత్ర చేయడానికి శృతిహాసన్ ఫుల్ పేమెంట్ అడిగిందట.

మాములుగా అయితే బేరసారాలు నడిపే నిర్మాత దిల్ రాజు కూడా శృతితో ఎలాంటి బేరాలు చేయకుండా ఆమె డిమాండ్ కి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శృతితో పేచీ పెట్టుకొని.. మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెడితే షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని దిల్ రాజు తన పద్దతులను పక్కన పెట్టి శృతి అడిగినంత ఇచ్చేస్తున్నారట.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus