Shruti Haasan: తప్పు అనగానే అలా చేస్తానన్న శృతి హాసన్!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ కు వకీల్ సాబ్ తో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరింది. సలార్ సినిమాతో శృతి హాసన్ పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ హీరోయిన్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నిజాయిగా ఆలోచించడంతోనే రోజును మొదలుపెడతానని శృతిహాసన్ అన్నారు. నిజాయితీ ద్వారా ప్రతిరోజూ తాను అందమైన పాఠాలను నేర్చుకుంటానని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని సమస్యలు ఎదురైతే కంగారు పడి ఆగిపోయే రకాన్ని తాను కాదని శృతిహాసన్ పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో సమస్య ఎక్కడ వచ్చిందో ప్రధానంగా తాను ఆలోచిస్తానని శృతి చెప్పుకొచ్చారు. జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి సహజంగా ఉంటాయని తప్పు అనగానే చాలామంది ఎదుటి వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తారని శృతి కామెంట్లు చేశారు.

తాను మాత్రం తన నుంచి మొదలుపెట్టి ఆత్మవిమర్శ చేసుకుంటానని శృతి పేర్కొన్నారు. అలా చేసిన తర్వాత మాత్రమే తాను ఇతర విషయాల గురించి చెప్పుకొస్తానని శృతి వెల్లడించారు. ఈ విధంగా జీవితం గురించి శృతి హాసన్ ఆసక్తికర కామెంట్లు చేయడం గమనార్హం. సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే శృతి హాసన్ కు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus