Shruti Hassan, Prabhas: ప్రభాస్ లో అదే బెస్ట్ క్వాలిటీ అంటున్న శృతి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలలో లేని బెస్ట్ క్వాలిటీలు ప్రభాస్ లో ఉన్నాయి. ఇతర హీరోలను గౌరవించే విషయంలో ఈ స్టార్ హీరో ముందువరసలో ఉంటారు. చాలామంది స్టార్ హీరోల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే ప్రభాస్ రెట్టింపు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. సలార్ బృందంతో కలిసి పని చేయడానికి తాను కొంత సమయం తీసుకున్నానంటూ శృతి హాసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సలార్ షూటింగ్ మొదలైన సమయంలో తాను ఫార్మల్ గా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రభాస్ సెట్స్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని శృతి హాసన్ అన్నారు. టీంకు మంచి ఫుడ్ ను ఏర్పాటు చేసే విషయంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని శృతి హాసన్ అన్నారు.

ప్రభాస్ ప్రేమతో టీంను పోషిస్తున్నారని ప్రభాస్ లో నేను గమనించిన బెస్ట్ క్వాలిటీ ఇదేనని శృతి హాసన్ పేర్కొన్నారు. శృతి హాసన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, బాలయ్య సినిమాలతో కూడా శృతి హాసన్ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఇంటర్వ్యూలలో ఇతర ప్రాజెక్ట్ లతో పోల్చి చూస్తే సలార్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.

సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా శృతి హాసన్ వరుస విజయాలను అందుకుంటారేమో చూడాలి. కెరీర్ విషయంలో శృతి హాసన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus