Siddharth , Aditi: శర్వానంద్ పెళ్లిలో సందడి చేసిన లవ్ బర్డ్స్.. వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్స్!

సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీలు కలిసి పలుమార్లు మీడియా కంటికి చిక్కారు అంటే తప్పకుండా వారి గురించి ఏవేవో వార్తలు రాస్తారు. ఇలాంటి వార్తలు నిలిచిన వారిలో నటుడు సిద్దార్థ్ నటి అదితి రావు హైదరి ఒకరు.వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ సినిమాలో శర్వానంద్ సిద్దార్థ్ హీరోలుగా నటించగా అదితీరావు సిద్దార్థ్ కి జోడిగా నటించారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు మొదలయ్యాయి.

ఈ విధంగా వీరిద్దరి (Siddharth) గురించి పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలను ఖండించే ప్రయత్నం కానీ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేదు అయితే ఇద్దరు కలిసి జంటగా ముంబై వీధులలో సందడి చేయడం పలు రెస్టారెంట్ల ముందు కనిపించడం చేస్తున్నారు. అలాగేఇద్దరు కలిసి సినిమా థియేటర్ల ముందు కూడా సందడి చేయడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే గతంలో హైదరాబాదులో శర్వానంద్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు కూడా వీరిద్దరూ జంటగా హాజరయ్యి అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేశారు. శర్వానంద్ పెళ్లి రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాహానికి హాజరు కావడం కోసం వీరిద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్లో కలిసి కనిపించారు.

ఇలా మరోసారి ఇద్దరూ జంటగా శర్వానంద్ రక్షితల వివాహానికి హాజరై సందడి చేశారు. అంతేకాకుండా జైపూర్ లోని రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బీనా కాన్ ఇంటికి చేరి ఆమెతో కలవడమే కాకుండా తనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ కలిసి జంటగా శర్వానంద్ వివాహానికి హాజరయ్యారు అంటూ వీరి గురించి మాట్లాడటమే కాకుండా మరోసారి డేటింగ్ వార్తలను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus