గుంటూర్ టాకీస్ చిత్రం తరువాత జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో సిద్దార్థ్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ ఓ ఐటి ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం.. లడఖ్ లో 60 శాతం చిత్రీకరణ జరుపుకోనుండగా, మిగిలిన భాగాన్ని హైదరాబాద్, శ్రీశైలం లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన నూతన కథానాయిక నటించనుండగా.. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఈ చిత్ర బృందం. దాదాపు మూడేళ్ళ తరువాత తెలుగులో సిద్దార్థ్ నటిస్తుండగా.. ఆయన చివరి సారి ఎన్టిఆర్ నటించిన బాద్ షా చిత్రంలో అతిథి పాత్రలో నటించారు..