తెలుగు ప్రేక్షకులకు లవర్ బోయ్ సిద్ధార్థ్ రిక్వెస్ట్

“బోయ్స్” సినిమాతో హీరోగా పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ సిద్ధార్థ్ తొలి చిత్రంతోనే లేడీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకొని అనంతరం తెలుగు-తమిళ భాషల్లో మంచి స్టార్ డమ్ కూడా దక్కించుకొన్నాడు. హీరోగా ఒక స్టేజ్ కి వచ్చాక తీసుకొన్న తప్పుడు డెసిషన్స్ కారణంగా కెరీర్ ఎండ్ చేసుకొన్నాడు. ఇదివరకు ఏడాదికి రెండు సినిమాలు చేసే సిద్ధార్థ్ ఇప్పుడు రెండు మూడేళ్లకు కానీ తెరపై కనిపించడం లేదు. ముఖ్యంగా.. సిద్ధార్థ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు రాకపోతుండడంతో స్వయంగా సినిమాలు నిర్మిస్తూ కెరీర్ ను నెట్టుకొస్తూ.. ఉనికిని కాపాడుకొంటున్నాడు సిద్ధార్థ్.

“గృహం” చిత్రంతో హీరోగా, ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టినప్పటికీ.. ఆ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ సినిమా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో విడుదలవ్వలేదు. మెలమెల్లగా తెలుగు ప్రేక్షకులు కూడా సిద్ధార్థను మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించాడో ఏమో కానీ.. తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి నాకు ఒక 18 నెలల టైమ్ ఇవ్వండి. ఈలోపు కచ్చితంగా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను. నా పని ఇంకా అయిపోలేదు అని ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ తో సిద్ధార్థ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్ అయిపోయారు. అయితే.. సిద్ధార్థ్ “అంధాధున్” రీమేక్ తోనే ప్రేక్షకుల్ని పలకరించనున్నాడని, త్వరలోనే ఆ సినిమా సెట్స్ కు వెళ్లనుందని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus