Siddharth: ‘పాన్‌ ఇండియా’ అంటే సిద్ధార్థ్‌కి ఎందుకంత కోపమో?

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. రాజమౌళి ‘బాహుబలి’తో మొదలైన ఈ చర్చ ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’ అంటూ కొనసాగుతోంది. దీనిపై ఒక్కొక్కరి వాదనలు ఒక్కోలా ఉన్నాయి. అసలీ పదం ఏంటో, ఎందుకు వినియోగిస్తున్నారో తెలియడం లేదు అని అంటుంటే.. మన సినిమాకు అంతటి గౌరవం చాలా గొప్ప విషయం అంటున్నారు ఇంకొందరు. అయితే నటుడు సిద్ధార్థ్‌ మాత్రం ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అదే పని చేశాడు సిద్ధార్థ్‌.

దక్షిణాది నటుడిగా కెరీర్‌ ప్రారంభించినా.. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి భారతీయ నటుడు అనిపించుకున్నాడు సిద్ధార్థ్‌. అలా సినిమాలను కూడా భారతీయ సినిమా అని అంటే సరిపోతుంది కదా అని చెబుతున్నాడు. సినిమాల్లో కొన్నింటిని పాన్‌ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా ఉందని సిద్ధార్థ్‌ వ్యాఖ్యానించాడు. తన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్‌ ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే ‘పాన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘పాన్‌ ఇండియా అనే పదం వినడానికే ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుండి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నాను. తమిళ సినిమాల్లో చేస్తే తమిళయన్‌గా, తెలుగు చిత్రాలు చేస్తే తెలుగింటి అబ్బాయిలా, ఇలా ఏ భాషలో వర్క్‌ చేస్తే ఆ భాషలో నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకుంటాను. అలాంటి చిత్రాలను ఇండియన్‌ ఫిల్మ్స్‌ అని పిలిస్తే బాగుంటుంది. అదే నాకు ఇష్టం కూడా. పాన్‌ ఇండియా అంటుంటే కాస్త అగౌరవంగా అనిపిస్తోంది’’ అని చెప్పాడు సిద్ధార్థ్‌.

హిందీ నుండి విడుదలైన సినిమాలను బాలీవుడ్‌ సినిమాలు అంటారు. అదే, ప్రాంతీయ చిత్రాలు మంచి ఆదరణ పొంది, భారీ విజయం అందుకున్నప్పుడు వాటిని పాన్‌ ఇండియా సినిమాలు అని ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించాడు సిద్ధార్థ్‌. అలాంటి సినిమాను భారతీయ చిత్రం అని అనొచ్చు కదా. ‘కేజీయఫ్‌’ లాంటి సినిమా విజయం అందుకుంటే… ఆ సినిమా జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని అనొచ్చు. లేదంటే ఆ సినిమా క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ ఫిల్మ్ అని చెప్పొచ్చు అంటున్నాడు సిద్ధార్థ్‌.

ఈ లెక్కన కొన్ని సినిమాలను పాన్‌ ఇండియన్‌ సినిమా అని కాకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ అని పిలవండి. పాన్‌ అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది అని సిద్ధార్థ్‌ వ్యాఖ్యానించాడు. సిద్ధార్థ్‌ ఆలోచనలు అయితే బాగున్నాయి. మరి వీటిని ఎవరు అమలు చేస్తారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus