భార్యకు తులాల కొద్ది బంగారం కానుకగా ఇచ్చిన బుల్లితెర నటుడు సిద్ధార్థ వర్మ?

బుల్లితెర నటుడు సిద్ధార్థ వర్మ గురించి పరిచయం అవసరం లేదు ఈయన బుల్లితెర పై ప్రసారమైన త్రినయని, కుంకుమపువ్వు,ఇద్దరమ్మాయిలు అభిషేకం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పలు సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ వర్మ బుల్లితెర నటి విష్ణు ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ఈయన కూడా ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె జానకి కలగనలేదు సీరియల్ లో మల్లిక పాత్రలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి విష్ణు ప్రియ తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నా బర్త్ డేకి మా ఆయన బంగారు కానుక అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా విష్ణు ప్రియ తన పుట్టినరోజు సందర్భంగా తన భర్తను గోల్డ్ షాప్ కి తీసుకువెళ్లి తనకు నచ్చిన బంగారు నగలను కొనుగోలు చేసి తన భర్త చేత బిల్లు కట్టించింది.ఈ క్రమంలోనే బంగారు నగలు కొనడానికి వెళ్లిన ఈమె తనకు నచ్చిన గాజులు నెక్లెస్ ఇయర్ రింగ్స్ వంటి వాటిని కొని ఇక బిల్లు మాత్రం సిద్ధార్థ వర్మ చేత కట్టించారు.

ఇక సిద్ధార్థ వర్మ సైతం తనకు తప్పదన్నట్టు బిల్లు మొత్తం కట్టేశారు. ఇలా పుట్టినరోజుకు తన భర్త చేత బంగారు నగలను కానుకగా తీసుకున్న ఈమె ఆ బంగారు నగలు ఏకంగా 200 గ్రాములకు పైగా విలువ చేశాయని తెలియజేశారు. ఈ షాపింగ్ కి సంబంధించిన వీడియోని విష్ణు ప్రియ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus