Siddu Jonnalagadda Remuneration: సిద్ధు జొన్నలగడ్డ రెమ్యునరేషన్ ఏకంగా మూడు రెట్లు పెరిగిందా?

డీజే టిల్లు (Dj Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా ముందు వరకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో సిద్ధు జొన్నలగడ్డ రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.

సిద్ధు జొన్నలగడ్డ టిల్లూ క్యూబ్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కొంతమంది స్టార్స్ సైతం తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు.

ఈ స్టార్స్ సపోర్ట్ తో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ పరంగా మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డతో సినిమాలను నిర్మించడానికి చాలామంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డ ఈ జనరేషన్ యూత్ కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఉండటంతో ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో సిద్ధు జొన్నలగడ్డకు క్రేజ్ పెరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ కు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus