Siddu: ఆ డైరెక్టర్ కు ముద్దు కూడా పెట్టాను!

డీజే టిల్లు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ మధ్యకాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం నిర్మాణంలో ఎంతో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం డీజె టిల్లు స్క్వేర్ పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే ఈ సినిమా తరచూ వివాదాలకు గురవుతుంది.. ముఖ్యంగా ఈ సినిమాలో నటించడం కోసం హీరోయిన్లు ఎవరు ఒప్పుకోవడం లేదని అందుకు హీరోతో ఉన్న విబేదాలే కారణమంటూ వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా ఈ సినిమా నుంచి తప్పకున్నారని తెలుస్తుంది. అయితే ఇలా ఈ సినిమా గురించి హీరో గురించి ఎన్నో వివాదాలు వస్తున్నా నేపథ్యంలో తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వివాదాలన్నింటికీ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకు డైరెక్టర్ మారిపోవడంతో సిద్దు జొన్నలగడ్డకు ఉన్నటువంటి విభేదాలే కారణమని వార్తలు వచ్చాయి. అయితే విమల్ కృష్ణకు తనకు మనస్పర్ధలు వచ్చాయని, అందుకే ఈ సినిమాకు దూరమయ్యారని తెలియడంతో ఈయన అక్కడే వీడియో కాల్ మాట్లాడే తనకు డైరెక్టర్ కు ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నటువంటి మాలిక్ రామ్ తో నేను రిలేషన్ షిప్ లో ఉన్నాను అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మాలిక్ రామ్ మా ఇంట్లోనే ఉంటాడు మాతో పాటు కలిసి భోజనం చేస్తాడు. ఇక తన నిద్రపోతున్నప్పుడు నేను తనకు దుప్పటి కూడా కప్పుతాను.

ఇంతలా నేను డైరెక్టర్ తో రిలేషన్షిప్ కొనసాగిస్తానని ఈ సందర్భంగా (Siddu) సిద్దు జొన్నలగడ్డ తెలియజేశారు. ఇకపోతే తాను కృష్ణ అండ్ హిస్ లీల సినిమా డైరెక్టర్ కి ముద్దులు కూడా పెట్టాను అంటూ సిద్దు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ గొడవల గురించి సిద్దు స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus