SIIMA 2019 Award Winners List: ‘సైమా’ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా సూపర్ స్టార్..!

దక్షిణాది తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుక హైదరాబాద్ లో మొదలైంది. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన అవార్డులను ప్రకటించనున్నారు. ఈ వేడుకలకు నాలుగు భాషలకు చెందిన సినీప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే కన్నడం, మలయాళం, తమిళం భాషల్లోని కొన్ని విభాగాలకు అవార్డులు అందించగా.. తాజాగా సైమా 2019కి గానూ తెలుగు అవార్డులు ప్రకటించారు.

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతల వివరాలు

ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)

ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)

ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)

ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)

ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)

ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)

ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)

ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)

ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)

ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)

ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)

ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ)

ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus