సైమా(SIIMA – South Indian International Movie Awards) అంటే విపరీతమైన క్రేజ్ నెలకొంది. 2012 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో సూపర్ హిట్ అయిన అలాగే క్రిటిక్స్ ని మెప్పించిన సినిమాలు..దానికి పని చేసిన ఫిలిం మేకర్స్ ను ఈ అవార్డులకు ఎంపిక చేసి సత్కరిస్తుంటారు. ఇక 2024 లో వచ్చిన సినిమాలకు సంబంధించిన అవార్డుల జాబితాని కూడా ప్రకటించి.. అవార్డులతో సత్కరించింది ‘సైమా’.ఇందులో భాగంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా సత్తా చాటింది అని చెప్పాలి. ఈ సినిమాకి ఎక్కువ అవార్డులు లభించాయి.ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమాకి కూడా ఎక్కువ అవార్డులు లభించాయి.ఇక తెలుగు సినిమాల విన్నర్స్ లిస్ట్ ను గమనిస్తే :
ఉత్తమ చిత్రం : ‘కల్కి 2898 AD’
ఉత్తమ దర్శకుడు : సుకుమార్(పుష్ప 2)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : ప్రశాంత్ వర్మ(హనుమాన్)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్(పుష్ప 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జా(హనుమాన్)
ఉత్తమ నటి : రష్మిక మందన్నా(పుష్ప 2)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : మీనాక్షి చౌదరి(లక్కీ భాస్కర్)
ఉత్తమ సహాయ నటుడు : అమితాబ్ బచ్చన్(కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి : అన్నే బెన్(కల్కి 2898 AD)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి(దేవర పార్ట్ 1)
ఉత్తమ గాయకుడు : శంకర్ బాబు కందుకూరి(పుష్ప 2)
ఉత్తమ గాయని : శిల్పా రావ్(దేవర పార్ట్ 1)
ఉత్తమ ప్రతినాయకుడు : కమల్ హాసన్(కల్కి 2898 AD)