డ్యాషింగ్ డైరెక్ట‌ర్ సైలెంట్ వెనుక కార‌ణ‌మేంటో..?

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఫైట‌ర్. పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండె హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన సినిమా కోవిడ్ కార‌ణంగా షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ఇప్పుడు బ్రేక్ ప‌డిన చిత్రాల‌న్నీ మ‌ళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన అభిమానుల కోసం ఏదో ఒక అప‌డేట్ ఇస్తూ త‌మ సినిమాల పై బ‌జ్ ఉండేలా చేసుకుంటున్నారు. అయితే కామన్ ఆడియ‌న్స్ సైతం ఎదురు చూస్తున్న పూరీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ బ‌య‌ట‌కు రావ‌డంలేదు.

నిలిపివేసిన సినిమా షూటింగ్‌ను మ‌ళ్ళీ ప్రారంభించారా అనేది కూడా ప్రేక్ష‌కులు తెలియ‌డంలేదు. డైరెక్ట‌ర్ల‌లో పూరీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. మ‌రోవైపు విజ‌య్‌కు ఉన్న రౌడీ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే ఇద్ద‌రి అభిమానులు ఓ రేంజ్‌లో ర‌చ్చ చేశారు. ఇక అంద‌రు హీరోలు, ద‌ర్శ‌కుల సినిమాల‌కు సంబంధించి అప‌డేట్స్ వ‌స్తుంటే, వీరి మూవీకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి న్యూస్ రాక‌పోవ‌డంతో ఇంత స‌లెంట్‌గా ఎందుకు ఉన్నార‌ని డై హార్ట్ ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. ఓ వైపు విజయ్ కామ్‌గా ఉంటే..

మ‌రోవైపు పూరీ మ్యూజింగ్స్ పేరుతో రోజుకో కొత్త అంశం తీసుకుని స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నాడు ఈ సెన్షేష‌న్ డైరెక్ట‌ర్. ఫైట‌ర్ మూవీ గురించి మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డంలేదు. దీంతో పూరీ ఫైట‌ర్ విష‌యంలో డైల‌మాలో ప‌డ్డాడా అనే అనుమానం క‌లుగుతోంది. ఇప్ప‌టికే ముంబైలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఫైట‌ర్, మ‌రో షెడ్యూల్ చేయాల్సి ఉండ‌గా క్యాన్సిల్ అయ్యింది. దీంతో హైద‌రాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాని టాక్ విన‌ప‌డుతోంది కానీ, చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. దీంతో పూరీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడో తెలియ‌దు కానీ, ఓ మైండ్‌బ్లాక్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ‌మ‌రి ఫైట‌ర్ టీమ్ నుండి త్వ‌ర‌లో అప్‌డేట్ వ‌స్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus