బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ లాజిక్ లేని పాయింట్స్ తో రెచ్చిపోయారు. ఒకే రీజన్ ని తిప్పి తిప్పి చెప్పి బాలాదిత్యని, రేవంత్ ని ఇద్దర్నీ టార్గెట్ చేశారు. అందరికంటే ఎక్కువగా బాలాదిత్యకి 8 ఓట్లు, రేవంత్ కి 6 ఓట్లు వచ్చాయి. బ్యాటరీ టాస్క్ లో బాలాదిత్య తన వైఫ్ తో ఆడియోకాల్ మాట్లాడేందుకు ఎక్కువ బ్యాటరీని వాడుకున్నాడని, తర్వాత హౌస్ లో మళ్లీ తప్పుచేశానని బాధపడ్డాడడని హౌస్ మేట్స్ నామినేట్ చేశారు.
అంతేకాదు, బ్యాటరీ జీరో పర్సెంట్ అయిపోతే బిగ్బాస్ తిరిగి మళ్లీ గేమ్ ని కొనసాగిస్తాడా లేదా అనేది అనుమానంగా ఉందని ఎందుకు బాధపడాల్సి వచ్చిందని ఇదే పాయింట్ ని తిప్పి తిప్పి చెప్తూ ఓట్లు గుద్దేశారు. అలాగే రేవంత్ హౌస్ లో కెప్టెన్ అయి కూడా రెండుసార్లు పడుకోవడం వల్ల బ్యాటరీ 10శాతం తగ్గిపోయిందని రీజన్స్ చెప్పారు. ఇంకా కొంతమంది అయితే సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేసుకున్నారు. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.,
ఫైమా – వాసంతీని ఇంకా బాలాదిత్యని నామినేట్ చేసింది.
రోహిత్ – రేవంత్ ఇంకా శ్రీహాన్,
శ్రీసత్య – బాలాదిత్య , రేవంత్
బాలాదిత్య – రేవంత్ , ఫైమా
ఆదిరెడ్డి – అర్జున్ , వాసంతీ
శ్రీహాన్ – ఇనయ, కీర్తి
మెరీనా – రేవంత్ , ఆదిరెడ్డి
గీతు రాయల్ – వాసంతీ , బాలాదిత్య
రాజ్ – బాలాదిత్య, వాసంతీ
ఇనయ – బాలాదిత్య, శ్రీహాన్
అర్జున్ – బాలాదిత్య , ఆదిరెడ్డి
వాసంతీ – రాజ్ , రేవంత్
కీర్తి – శ్రీహాన్, బాలాదిత్య
రేవంత్ – శ్రీసత్య , మెరీనా
సూర్య – బాలాదిత్య, రేవంత్ లని నామినేట్ చేశాడు. ఇక నామినేషన్స్ లో రేవంత్ పుష్ప రేంజ్ లో స్టైల్ ఇవ్వడం, ఇనయ శ్రీహాన్ ల సిల్లీ ఇమిటేషన్, ఆదిరెడ్డి అర్జున్ ల ఫన్, బాలాదిత్య డైలాగ్స్, ఇవన్నీ హైలెట్ అయ్యాయి. నామినేషన్స్ లో ఈసారి ఏకంగా 13మంది ఉన్నారు. ఇందులో కెప్టెన్ సూర్య., ఇంకా గీతురాయల్ తప్ప హౌస్ లో అందరూ ఉండటం అనేది గమనార్హం. ఈసారి బిగ్ బాస్ కనికరం లేకుండా ఒక్క ఓటు వచ్చినా కూడా నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చాడు. మరి ఈవారం ఇంతమందిలో ఎవరు సేఫ్ అవుతారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!