Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Reviews » Simbaa Review in Telugu: సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

Simbaa Review in Telugu: సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 9, 2024 / 05:40 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Simbaa Review in Telugu: సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వశిష్ఠ సింహా (Hero)
  • అనసూయ (Heroine)
  • దివి వైద్య జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు (Cast)
  • మురళీ మనోహర్ రెడ్డి (Director)
  • సంపత్ నంది, రాజేందర్ సంయుక్త (Producer)
  • కృష్ణ సౌరభ్ (Music)
  • కృష్ణ ప్రసాద్ (Cinematography)
  • Release Date : ఆగస్టు 09, 2024
  • సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్ష (Banner)

ప్రతీవారంలానే ఈ వారం కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సింబా (Simbaa) అనే సినిమా కూడా ఉంది. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించడం, అనసూయ (Anasuya Bhardhwaj) ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషించడం.. ఇంకా చాలా మంది స్టార్స్ కూడా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. వారిని ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

Simbaa Review

కథ : అక్ష(అనసూయ) ఒక టీచర్. తన స్కూల్లో బెస్ట్ టీచర్ గా అవార్డులు అందుకుంటూ.. మరోవైపు సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈమె .. తన భర్త, పాపతో కలిసి ఒక కాలనీలో చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి స్కూటర్ పై వెళ్తూ ఒక సిగ్నల్ వద్ద ఆగిన ఈమెకి లోకి (కేశవ్ దీపిక్ ) ను చూసి ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కారులో వెళ్తున్న అతన్ని వెంబడించి దారుణంగా కొట్టి చంపుతుంది.

అలాగే మరో హత్య కూడా చేసి అనురాగ్ (వశిష్ట సింహా) (Vasishta N. Simha) అనే పోలీస్ ఆఫీసర్ కి దొరికిపోతుంది. ఆమెతో కలిసి జర్నలిస్టు ఫాజిల్ (శ్రీధర్ మాగంటి (Srinath Maganti ) అలాగే ఒక డాక్టర్ (అనీష్ కురువెళ్ల (Anish Kuruvilla) కూడా ఈ హత్యల్లో పాల్గొంటారు. వాళ్ళని కూడా అనురాగ్ అరెస్ట్ చేస్తాడు. అసలు ఒకరితో మరొకరికి సంబంధం లేని ఈ ముగ్గురూ కలిసి ఎందుకు హత్యలు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : అనసూయ మంచి నటిగా ప్రూవ్ అయ్యి చాలా కాలం అయ్యింది. కాకపోతే ఈ మధ్య విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ఆమె సింబా ఎంపిక చేసుకున్నట్లు అర్దం చేసుకోవచ్చు. ఇందులో ఒక అపరిచితురాలు టైపు పాత్ర పోషించింది అనసూయ. ఆమె వరకు బాగా చేసింది. ఆ తర్వాత శ్రీధర్ మాగంటి, అనీష్ కురవెళ్ల ..ల పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. వశిష్ట్ సింహా ఒక సెమీ హీరో టైపు పాత్ర పోషించించాడు.

తన వరకు హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక జగపతిబాబు (Jagapathi Babu) రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ రోల్ చేశాడు అని చెప్పాలి.ఈ కథలో చాలా కీలకమైన పాత్ర అది. ఇక కబీర్ పాత్ర ఓకే అనిపించినా.. దివి(Divya Vadthya) , కస్తూరి.. ల పాత్రలు గెస్ట్ రోల్స్ ని తలపించాయి. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘సింబా’ (Simbaa) కి కథ అందించింది నిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది. అయితే అతని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన మురళీ మనోహర్ డైరెక్ట్ చేయడం జరిగింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ.. స్క్రిప్ట్ ను బాగానే డిజైన్ చేయించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే నడిపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచే విధంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ గాడి తప్పింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న సస్పెన్స్ ను సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోయాడు.

గౌతమి (Gautami Tadimalla) పాత్ర ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో మిగిలిన కథపై ఒక అవగాహన వచ్చేస్తుంది. అక్కడి నుండీ ప్రతి సీన్ ను ముందుగానే గెస్ చేసే విధంగా ఉంటుంది. అక్కడ గ్రిప్పింగ్ నెరేషన్ ఉంటే సినిమా గట్టెక్కేసేది. అక్కడ అది లోపించడం వల్ల ఇది సాదా సీదా సినిమాగా మిగిలిపోయినట్టు అవుతుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. సంగీతం పరంగా చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు ఓకే, పాటలు ఎక్కువగా లేవు. ఉన్న చిన్న చిన్న పాటలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూడలేదు.

విశ్లేషణ: నేచర్.. కార్పొరేట్ సంస్థల వల్ల ఎలా నాశనం అవుతుంది అనే మంచి పాయింట్ తో రూపొందిన సినిమా. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ నిరాశపరిచింది.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bhardhwaj
  • #Gautami
  • #jagapathi babu
  • #Murali Manohar
  • #sampath nandi

Reviews

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

trending news

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

7 mins ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

11 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

13 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

13 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

14 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

16 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

16 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

20 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version