‘18 పేజెస్‌’ & ‘వరిసు’ కోసం శింబును తీసుకొస్తున్నారు!

శింబుకి పాటలు పాడటం అంటే ఇష్టం.. అందులోనూ తెలుగులో పాటలు పాడటం అంటే ఇంకా ఇష్టం. ఇప్పటికే శింబు తెలుగు పాటలు కొన్ని పాడాడు. అయితే ఒకేసారి రెండు పాటలు పాడిన సందర్భం చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ రోజు వచ్చింది. శింబు తన స్నేహితుడు కోసం ఓ పాట పాడగా, యువ తెలుగు హీరో కోసం ఇంకో పాట పాడుతున్నాడట. స్నేహితుడు విజయ్‌ కోసం ‘వరిసు’లో ఓ పాట పాడగా.. నిఖిల్‌ కోసం మరో పాట పాడాడు శింబు.

శింబు టిపికల్‌ వాయిస్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇప్పటికే శింబు ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో ‘డైమెండ్ గర్ల్…’ అనే పాట ఆలపించారు. ఆ తర్వాత మంచు మనోజ్ సినిమా ‘పోటుగాడు’ కోసం ‘బుజ్జి పిల్ల…’ అనే పాట పాడారు. మొన్నీమధ్యే రామ్ పోతినేని ‘వారియర్’ సినిమా కోసం ‘బుల్లెట్ సాంగ్..’ పాడి అలరించారు. ఇప్పుడు మరోసారి తనలోని గాయకుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న తమిళ చిత్రం ‘వరిసు’.

తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడాడు అని వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆ పాట రికార్డింగ్‌ కూడా పూర్తయిందట. త్వరలోనే ఆ పాట టీజర్‌ను బయటకు వదులుతారట. అలాగే నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు..’ అనే పాటను పాడనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌ చేశారు.

ఆ లెక్కన శింబు పాడిన పాటల్ని తెరపై దగ్గర దగ్గరలోనే చూస్తాం అన్నమాట. డిసెంబరు ఆఖరి వారంలో ‘18 పేజెస్‌’లో ఓ పాట చూడనుండగా.. మరో రెండు వారాలకు సంక్రాంతి సీజన్‌లో ‘వరిసు’లో వింటాం. అయితే విజయ్‌ కోసం శింబు పాడిన పాట కేవలం తమిళ వెర్షన్‌కేనా, లేక తెలుగులో కూడా పాడాడా అనేది తెలియాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus