కోలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శింబు కొన్నాళ్లుగా సినిమాలు చేయడం తగ్గించాడు. ఈ మధ్యనే ‘ఈశ్వరన్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ హీరోకి తమిళ నిర్మాతల మండలి తేరుకోలేని షాకిచ్చింది. భవిష్యత్తులో ఆయన నిర్మించనున్న సినిమాలను ఏ మాత్రం సహకరించకూడదని నిర్మాతల మండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రముఖ నిర్మాత బాలాజీ కబాకు చెల్లించాల్సిన బాకీను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెల్లించడంలో మాట తప్పినందుకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించింది. నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా తతంగమే నడిచింది.
శింబు హీరోగా నిర్మాత మైఖేల్ రాయప్పన్ ‘అన్బానవన్ – అరసాదవన్ – అడంగాదవన్’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న శింబు.. తన అభీష్టం మేరకు నిర్మించారు. అలా రిలీజైన సినిమా కాస్తా.. ప్లాప్ అయింది. దీంతో నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం కలిగింది. ఈ క్రమంలో నిర్మాత, హీరో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. ఓ సినిమాను ఫ్రీగా చేస్తానని ఒప్పుకున్నాడు శింబు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ తరువాత శింబు మాట తప్పారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాతల మండలి.. ఇరువర్గాలను పిలిచి సంప్రదింపులు జరిపారు.
అప్పుడు నిర్మాత కోరిక మేరకు శింబు ఒక సినిమాలో డబ్బు తీసుకోకుండా నటించాలి. లేదంటే రూ.6.60 కోట్లను మూడు దఫాలుగా రూ.2.20 కోట్ల చొప్పున చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ ఒప్పందంపై శింబు సంతకం కూడా చేశారు. కానీ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లఘించారు. ఫ్రీగా సినిమా చేయలేదు సరికదా.. మొదటి దఫాలో చెల్లించాల్సిన డబ్బుని కూడా చెల్లించలేదు. దీంతో సీరియస్ అయిన నిర్మాతల మండలి శింబు భవిష్యత్తులో నటించే సినిమాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదనే నిర్ణయం తీసుకుంది. మరి ఈ గొడవను శింబు ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి!
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!