Simhadri Re-Release: కలెక్షన్లతో ఆ రికార్డును సొంతం చేసుకున్న సింహాద్రి.. ఆ సినిమాలకు షాకిస్తూ?

ఈ మధ్య కాలంలో ఏ సినిమా రీ రిలీజ్ కు జరగని స్థాయిలో సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 1000 స్క్రీన్లలో రీ రిలీజ్ అయింది. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ అయినా సరైన ప్లానింగ్ లేకుండా ఆ సినిమాలను రీ రిలీజ్ చేయడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఆ సమయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లు ఫ్యాన్స్ ను సైతం బాధ పెట్టాయి.

అయితే సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించి మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. సింహాద్రి సినిమా రీరిలీజ్ లో డే1 కలెక్షన్లకు సంబంధించి రికార్డులు క్రియేట్ చేసింది. రీరిలీజ్ సినిమాలలో కొత్త రికార్డ్ ను సెట్ చేసి భవిష్యత్తులో రీ రిలీజ్ అయ్యే సినిమాలకు ఈ సినిమా భారీ టార్గెట్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా (Simhadri) ఈ సినిమా 6 కోట్ల 2 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఒక్కరోజులో సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం కానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4.95 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలెక్షన్లు 40 లక్షల రూపాయలు కాగా ఓవర్సీస్ లో ఈ సినిమా 67 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. రీ రిలీజ్ లో ఫుల్ రన్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. శనివారం రోజున రీ రిలీజ్ చేయడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా కలిసొచ్చిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus