Ram Charan, Jhanvi Kapoor: ఆ విషయంలో చరణ్‌.. జాన్వీ ఒక్కటే.. తెలుసా?

రామ్‌చరణ్‌, జాన్వీ కాంబినేషన్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పార్ట్‌ 2 కానీ, రీమేక్‌ కానీ వస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుండి అభిమానులు అంటున్నారు. చిరంజీవి, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు కూడా ఈ మాట చెప్పారు. అయితే ఈ జోడీ ఎప్పుడు కుదురుతుందో లేదో తెలియదు కానీ… మరో విధంగా ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు. అదే పేర్లను గుర్తుంచుకునే విషయంలో. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం సమయంలో రామ్‌చరణ్‌ గురించి తారక్‌ ఓ విషయం చెప్పాడు గుర్తుందా?

మనుషుల పేర్లను చరణ్‌ ఒక్కోసారి ఒక్కోలా పిలుస్తాడని, అసలు పేరు గుర్తుండకపోవడం వల్లే అలా అంటాడని తారక్‌ చెప్పాడు. అప్పుడు చెప్పిన పేరు సుమేర్‌/సమీర్‌/సమైర్‌. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరో పేరు వైరల్‌ అవుతోంది. అదే సాకేత్‌/సంకేత్‌. ఈ పేర్లు చెప్పింది జాన్వీ కపూర్‌. జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ కలసి ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోకి వచ్చారు. అక్కడ కేదార్‌నాథ్‌లో జరిగిన ఓ మరపురాని ఘటన గురించి కరణ్‌ ప్రస్తావించాడు.

దానికి సారా, జాన్వీ అక్కడేం జరిగిందనేవి చెప్పుకొచ్చారు. చాలాసేపు సాగిన ఈ నెరేషన్‌లో సాకేత్‌ అనే పేరు వచ్చింది. అతను వాళ్లకు కేదార్‌నాథ్‌లో సహాయకుడిగా ఉన్నాడట. అయితే అతని పేరును సంకేత్‌ అని చెప్పింది జాన్వీ. కానీ సారా మాత్రం అతని పేరు సాకేత్‌ అని చెప్పింది. మనుషుల పేర్లు అలా మార్చేయొద్దు అంటూ జాన్వీ మీద సారా కౌంటర్‌ వేసింది కూడా. ఇక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైమ్‌లో ఇలాగే పేర్ల విషయంలో రామ్‌చరణ్‌పై తారక్‌ ఇలాంటి కౌంటరే వేశాడు.

Ram Charan To Romance With Jhanvi Kapoor In That Remake1

ఇద్దరూ వ్యక్తుల పేర్లను మరచిపోవడం, రకరకాలుగా పిలవడంతో చరణ్‌, జాన్వీ జోడీ భలే కుదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే ఇంకెంతమంది పేర్లు మార్చేస్తారో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నిజమే కదా.. అలాంటి రోజులు రావాలి పేర్లు కూడా మారాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus