సలార్, వార్2 సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న సినిమాలు అనే సంగతి తెలిసిందే. సలార్ సినిమా ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కుతోంది. వార్2 సినిమాలో మాత్రం ఇద్దరు శత్రువులు స్నేహితులుగా కనిపించనున్నారు. సలార్ అలాంటి కథతో తెరకెక్కుతుంటే వార్2 ఇలాంటి కథతో తెరకెక్కుతోంది. సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండగా వార్2 లో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
ఈ రెండు సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలను సైతం షేక్ చేసే సినిమాలు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. (Salaar) సలార్, వార్2 సినిమాల కథల విషయంలో భిన్నమైన పోలికలు ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. సలార్ మూవీ మరో 22 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుండగా వార్2 సినిమా రిలీజ్ కోసం మరో 20 నెలల ఎదురుచూపులు తప్పవు. టాలీవుడ్ స్టార్ హీరోలు భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు.
టాలీవుడ్ స్టార్స్ సినిమాలకు బిజినెస్ కూడా అంచనాలకు మించి పెరుగుతోంది. స్టార్ హీరోల రెమ్యునరేషన్లు సైతం మరీ భారీ రేంజ్ లో ఉన్నాయి. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా పెద్ద సినిమాలకు భారీ స్థాయిలో ఆదాయం వస్తున్న నేపథ్యంలో హీరోలు పారితోషికాల విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.
ప్రభాస్, తారక్ కాంబోలో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబో సాధ్యమవుతుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్, తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్, తారక్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.