వైరల్ అవుతున్న సింధు మీనన్ కొత్త లుక్..!

దివంగత నటుడు శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సింధు మీనన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిన సింధు.. మహాలక్ష్మీ పాత్రలో జీవించి ప్రశంసలు అందుకుంది. అటు తరువాత కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘త్రినేత్రం’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి సంపూర్ణ నటి అనిపించుకుంది. అటు తరువాత ఈమెకు వరుస ఆఫర్లు దక్కాయి. ‘శ్రీరామ చంద్రులు’ ‘ఆడంతే అదో టైపు’ ‘చందమామ’ ‘సిద్ధం’ ‘వైశాలి'(తమిళ్ డబ్బింగ్ సినిమా) వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులు వేయించుకుంది. తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈమె వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గిన వెంటనే… పెళ్లి చేసుకుని పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రభు అనే ఎన్నారై ను పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది. సింధుకి ఇద్దరు పిల్లలు… ఒక పాప అలాగే ఒక బాబు. వారి ఆలనా.. పాలనా.. చూస్తూ అందంగా గడుపుతుంది. తిరిగి సినిమాల్లో నటించే అవకాశం ఉందా.. అని ఈమెను అడిగితే.. ప్రస్తుతానికి అలంటి ఆలోచనే లేదని.. తేల్చి చెప్పేసింది. ఇక సింధు మీనన్ కు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus