మా ప్రపంచంలోకి వాళ్ళొచ్చారు: చిన్మయి, రాహుల్

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన చిన్మయి శ్రీపాద… తాజాగా కవలలకి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి భర్త, నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మా ప్రపంచంలోకి దృప్త, శర్వస్ ఎంటరయ్యారు,ఇక మా తో ఉండిపోయే అతిథులు వీళ్ళు…’ అంటూ పేర్కొన్నాడు రాహుల్. ఇదే విషయాన్ని చిన్మయి కూడా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చిన్నారుల చేతులను పట్టుకుని ఉన్న ఫోటోలను ఈ జంట షేర్ చేశారు.

కవలల్లో ఒక బాబు, పాప ఉన్నారు.ఇలా పుడితే ఆ జంట చాలా అదృష్టవంతులు అంటుంటారు. ఏదైనా మంచి జరగాలి అని ఆశించేవారు.. ఆ పనికి వెళ్లేముందు ఇలాంటి జంటని చూస్తే చాలా మంచిదని పెద్దలు, పూజారులు చెబుతుంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, రాహుల్- చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాహుల్- చిన్మయి లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత 2014లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.చిన్మయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బెస్ట్ ఫ్రెండ్ అలాగే..

17-Rahul Ravindran With His Wife Chinmayi

సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది.అలాగే ఎన్నో సూపర్ హిట్ పాటలు కూడా పాడింది చిన్మయి. అయితే ‘మీ టూ’ ఉద్యమాన్ని సౌత్ లో పాపులర్ చేసింది చిన్మయినే.! కెరీర్ ప్రారంభంలో తమిళ పాటల రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడు అంటూ మీడియా ముఖంగా చెప్పి మరింతగా పాపులర్ అయ్యింది చిన్మయి. ఈ క్రమంలో ఆమెని చాలా సినిమాల నుండీ తీసేసి ఆమె ఉపాధి పై దెబ్బ కొట్టారు. అయినా ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus