చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) అంటే మనకు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గుర్తొస్తారు. సినిమాల బయట అయితే మహిళా సాధికారత, చిన్న పిల్లల సంరక్షణ లాంటి సమాజాభివృద్ధి కార్యక్రమాలు గుర్తొస్తాయి. రెండో అంశం గురించి ఇప్పుడు వద్దు కానీ.. తొలి స్లాట్‌లో వచ్చిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌తోపాటు ఆమెలో మరో టాలెంట్ కూడా ఉంది. అదే ర్యాపర్. అవును ఆమె సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో సినిమాలకు ర్యాప్ పాడారు. అలా ‘ఆరెంజ్’ (Orange) సినిమాలో ఓ ర్యాప్ పాడారు.
దాని వెనుక ఉన్న కథను ఇటీవల ఫిల్మీ ఫోకస్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆరెంజ్’ సినిమాకు సంగీత దర్శకత్వం చేసిన హారిస్ జయరాజ్‌కు (Harris Jayaraj) ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రతి పాటను ఆయన నలుగురైదుగురు సింగర్స్‌తో పాడించి. అందులోంచి నచ్చిన పార్ట్స్ వరకు తీసుకొని పాటను ఫైనల్ చేస్తుంటారు. అలా చిన్మయి కూడా ఆ సినిమాకు పాడారట. అయితే సినిమాలో ఆ ర్యాప్ ఎక్కడుందో కూడా మరచిపోయారట.
సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే టైటిల్ కార్డ్స్‌లో తన పేరు చూసి ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆమె పాడింది మేల్ వాయిస్ ఉన్న చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్‌లో చిన్న ర్యాప్ మాత్రమే. దీంతో ఓసారి ఆమె హారిష్ జైరాజ్‌ను కలిసినప్పుడు ‘నాకు అలా క్రెడిట్ ఇవ్వొద్దు. ఆ సాంగ్ ఎక్కడ పాడానో కన్‌ఫ్యూజ్ అవుతున్నాను’ అని అన్నారట. ఆ పాటలో ఓ లేయర్ మాత్రమే తనది అని ఆమె చెప్పుకొచ్చారు.
అంతేకాదు ‘రంగం’ (Rangam) సినిమాలో కూడా ఓ ర్యాప్ ఇలానే పాడానని చెప్పారు చిన్మయి. ఇలాంటివి హారిష్ సంగీత దర్శకత్వంలోనే ఇలాంటివి జరుగుతాయని ఆమె చెప్పారు. ఆయన స్టైల్ అలానే ఉంటుందని, ఐదుగురు సింగర్స్ పాడాక ఆయనకు నచ్చిన లేయర్స్‌ను తీసుకుంటారని ఆయన వర్క్ స్టైల్ గురించి చెప్పారు. ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాలో ‘ఓడియమ్మ..’ సాంగ్‌లో కూడా శ్రుతి హాసన్ (Shruti Haasan) , తన వాయిస్ లేయర్స్ ఉంటాయని తెలిపారు.