సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కల్పన సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కల్పన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందాల రాక్షసి అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. నా తొలి పాటను శైలజ గారితో కలిసి తెలుగులో పాడానని కల్పన అన్నారు. బాలనటిగా సినిమాలలో నటించానని షూటింగ్ లకు వాడే లైటింగ్ ఇబ్బంది పెట్టడం వల్ల నటనకు దూరమయ్యానని ఆమె అన్నారు. నాకు లైవ్ సింగింగ్ నచ్చుతుందని సింగర్ కష్టం, సామర్థ్యం లైవ్ సింగింగ్ లోనే తెలుస్తుందని కల్పన చెప్పుకొచ్చారు.
పాడటం మరిచిపోతున్న సమయంలో స్వరాభిషేకం లభించిందని ఈ కార్యక్రమం ద్వారా పాటలకు పదును పెట్టే అవకాశం కలిగిందని ఆమె అన్నారు. నాన్న వల్లే తెలుగు భాషపై పట్టు సాధించానని కల్పన తెలిపారు. నేను సిద్ధ మెడిసిన్ చేశానని ఇంట్లోనే నాకు, పిల్లలకు వైద్యం చేస్తానని ఆమె అన్నారు. అరబిక్ లో మంచి సాహిత్యం ఉందని బాగా తెలుసుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. బాలు గారి కోరిక మేరకు పీ.హెచ్.డీ చేశానని ఆమె కామెంట్లు చేశారు.
నాకు ముగ్గురు అమ్మాయిలని పెద్దమ్మాయి భరతనాట్యం నేర్చుకుంటుందని కల్పన అన్నారు. అజ్ఞానంతో వెళ్లి స్టేజ్ ఎక్కొద్దని నా పిల్లలకు చెప్పానని కల్పన చెప్పుకొచ్చారు. డబ్బింగ్ చెప్పడం కంటే పాటలు పాడటం సులువు అని కల్పన కామెంట్లు చేశారు. 2010 సంవత్సరంలో వివాహ బంధం ముగిసిందని ఆమె చెప్పుకొచ్చారు. పాప ఉన్నా ఉద్యోగం కూడా లేదని ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నానని కల్పన తెలిపారు.
సింగర్ చిత్రమ్మ సూచనల మేరకు పాటల పోటీలో పాల్గొన్నానని ఆమె అన్నారు. ఆ పోటీలో గెలిచిన తర్వాత నాలో మార్పు వచ్చిందని అప్పటివరకు నేను చీకటిలో ఒంటరి పోరాటం చేశానని ఆమె అన్నారు. కష్టపడి పైకి రావాలని శ్రమతో విజయాలు దక్కాలని ఆమె వెల్లడించారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!