Kalpana: భర్తతో నాకు మనస్పర్థలు లేవు: గాయని కల్పన వీడియో!

నిద్ర మాత్రలు తీసుకున్నారు, అపస్మార స్థితిలోకి వెళ్లారు అని ఎవరి గురించైనా సమాచారం వస్తే, అచేతన స్థితిలో ఆస్పత్రిలో చేరితే అందరికీ వచ్చే అనుమానం ఏమైనా ఆత్మహత్యాయత్నం చేశారా అని. ప్రముఖ గాయని కల్పన (Kalpana)  విషయంలో ఇదే జరిగింది. ఆ తర్వాత పోలీసు వర్గాల నుండి కూడా దాదాపు ఇలాంటి సమాచారమే వచ్చింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే కల్పన భర్త, ఆమె తనయ కాస్త క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

Kalpana

గాయని కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భర్త ప్రభాకర్‌ ప్రమేయం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి ప్రచారం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ కల్పన ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని.. అందుకే స్లీపింగ్‌ టాబ్లెట్స్ వేసుకున్నట్లు ఆ వీడియోలో చెప్పారు.

మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మా కుటుంబం సంతోషంగా జీవిస్తున్నాం. నేను ఇప్పుడు పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దాని కోసం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన టాబ్లెట్స్‌లో ఓవర్ డోస్ తీసుకున్నాను అని చెప్పారామె.

ఆ కారణంగానే స్పృహ తప్పానని, నా భర్త సరైన సమయంలో స్పందించి.. కాలనీవాసుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారామె. పోలీసుల సాయం వల్ల నేను ఇలా మీ ముందు ఉన్నాను. త్వరలో మళ్లీ నా పాటలతో అలరిస్తాను. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ నా భర్త అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారామె. దీంతో ఇకనైనా కల్పన గురించి పుకార్లు ఆగుతాయేమో చూడాలి.

రాజమౌళి ఎంత కేర్ తీసుకున్నా లీకులు తప్పట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus