ఇండియన్ వైడ్ స్టార్ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చెన్నై ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో ఎస్పీబి చికిత్స పొందుతున్నారు.ఆయన్ని వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. ఎస్పీబి గారి తనయుడు చరణ్ కూడా.. ‘తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అందుకే ఏ అప్‌డేట్ ఇవ్వ లేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు.మా నాన్న గారు త్వరగా కోలుకుని మన మధ్యకు రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని కూడా ఆయన కోరాడు.
ఈ క్రమంలో చిరంజీవి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి వారు వీడియోలు రిలీజ్ చేసి ఎస్పీబి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సింగర్ మాళవిక కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. జూలై నెలాఖరులో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎస్పీబి తో పాటు ఈమె కూడా పాల్గొంది. దాంతో మాళవిక వల్లే ఎస్పీబికి కరోనా సోకినట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై ఆమె క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది.
‘బాల సుబ్రహ్మణ్యం గారికి ఈ నెల 5న కరోనా సోకింది. కానీ నాకు ఈ నెల 8 న సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కాబట్టి నా వల్ల ఆయనకు కరోనా సోకింది అనేది అసత్య ప్రచారం ఆపండి. ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాను. నాతో పాటు నా కూతురికి కూడా అలాగే నా తల్లిదండ్రులకి కూడా కరోనా సోకింది’ అంటూ చెప్పుకొచ్చింది సింగర్ మాళవిక.