సింగర్ మంగ్లీ ఇప్పుడిప్పుడే స్టార్ సింగర్ గా ఎదుగుతుంది. తెలంగాణా ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ తో పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవల ఆమె లవ్ స్టోరీ సినిమాలో పాడిన సారంగ ధరియా, ఆచార్య మూవీలో పాడిన లాహే లాహే, సీటిమార్ లో పాడిన జ్వాల రెడ్డి వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.ఈమెతో కనీసం ఒక్క పాటైనా తమ సినిమాల్లో పాడించుకోవాలని దర్శక నిర్మాతలు, హీరోలు భావిస్తున్నారు. ఓ పక్క సినిమాల్లో పాడుతూనే మరోపక్క జానపద, భక్తి రస పాటలు పాడుతుంది మంగ్లీ.
తెలుగు పండుగలు వస్తున్నాయి అంటే ఈమె పాడిన పాటలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈమె పాడిన బోనాల పాట వివాదాస్పదం అయ్యింది.వివరాల్లోకి వెళితే..తెలంగాణలో బోనాల ఉత్సవాల దగ్గర పడుతున్న సందర్భంగా ‘చెట్టుకింద కూసున్నవమ్మా’ అంటూ సాగే బోనాల పాటతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంగ్లీ. జూలై 11న యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాట పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
అమ్మవారి పై ఈ పాటలో వాడిన కొన్ని పదాలు ఘోరంగా ఉన్నాయని వారు కామెంట్స్ చేస్తున్నారు ‘బోనాలు అనేవి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అంటుంటారు. కానీ.. అమ్మవారి పాటలా ఉందా ఇది? దేవతని మొక్కినట్టులేదు తిడుతున్నట్టుంది. అప్పట్లో నీ ఎలాంటి పాటలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు నీ పాట ఎలా ఉంది? భక్తి పేరుతో దేవుళ్లని అపహాస్యం చేయకు’ అంటూ మంగ్లీపై మండిపడుతున్నారు నెటిజన్లు. అంతే కాదు లిరిక్స్ మార్చాలంటూ అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్