అనంతపురంకి చెందిన సత్యవతి.. ఇలా చెబితే కొత్తగా ఉంటుందేమో అదే.. సింగర్ మంగ్లీ అనగానే ప్రతి ఒక్కరిలో ఓ జోష్ వస్తుంది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో భక్తి పాటలు, జానపద పాటలు పాడి పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో మాస్ పాటలు పాడుతూ.. వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈమె పాడిన పాటలే చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి.ఇప్పటివరకు 30 సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ..
నటిగా కూడా మారి రెండు, మూడు సినిమాల్లో నటించేసింది. మంగ్లీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మంగ్లీ చూడ్డానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈమె లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ అలాగే డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :