Mangli: మంగ్లీ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలిస్తే..అయ్యో పాపం అంటూ జాలిపడతారు..!

సింగర్ మంగ్లీ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తెలంగాణ ఫోక్ సాంగ్స్ ..బతుకమ్మ ..బోనాలు ..సమ్మక్క – సారక్క.. శివరాత్రి సాంగ్స్ పాడి జానపద గేయనిగా సింగర్ మంగ్లీ మంచి గుర్తింపు సంపాదించుకుంది . తన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసి మంచి క్రేజ్ దక్కించుకునింది . అంతకుముందు యాంకర్ గా వి6 న్యూస్ అనే ఛానల్ లో పనిచేసిన ఈమె ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడి మెప్పించింది .

అంతేకాదు ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తుంది . పొలిటికల్ గాను కొన్ని సాంగ్స్ పాడి అలరించింది. కాగా రీసెంట్గా మంగ్లీ మోడరన్ దుస్తుల్లో కనిపించింది. ఎప్పుడు ట్రెడిషనల్ వేర్లో కనిపించే మంగ్లీ ఇలా టోటల్ అవుట్ లుక్ ని మార్చేస్తూ మోడరన్ గర్ల్ గా కనిపించడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . అయినా సరే ఎక్కడ ఎక్స్పోజింగ్ వల్గారిటీ లేకుండా తన హద్దుల్లోనే ఉండింది .

అయితే ఇలాంటి మూమెంట్లోనే గతంలో మంగ్లీ హీరోయిన్ గా నటించాల్సిన సినిమా డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాలో మంగ్లీ హీరోయిన్గా నటించాల్సి ఉండింది. శేఖర్ కమ్ముల ఈ పాత్ర కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే మంగ్లీ కి హీరోయిన్ అవ్వాలని ఆశ లేదు ..

కాబట్టి ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ చుట్టూ తిరిగిన ఫైనల్లీ శేఖర్ కమ్ముల సాయి పల్లవికి ఫిక్స్ అయ్యాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మంగ్లీ ఫిదా సినిమా చేసి ఉంటే అమె రేంజ్ మరోలా ఉండేదని టాక్. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus