Singer Mangli: మాస్ట్రో సినిమాలో మంగ్లీ రోల్ అదే..!

చెక్, రంగ్ దే సినిమాలతో మరోసారి వరుస బాక్సాఫీస్ డిజాస్టర్స్ చూసిన నితిన్ మళ్లీ మ్యాస్ట్రో సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.

హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం హాట్ టాపిక్ గా మారింది. హిందీలో హీరోని కిడ్నాప్ చేసి కళ్ళు దొంగతనం చేయాలని ఒక మహిళ తో పాటు మరొక వ్యక్తి అలాగే డాక్టర్ ప్లాన్ వేస్తారు. ముఖ్యంగా అందులో కిడ్నాప్ చేసే మహిళ పాత్ర సినిమాలో చాలా కీలకమని చెప్పాలి. ఇక తెలుగులో ఆ పాత్రను ఎవరు చేస్తారని అనుకుంటున్న తరుణంలో చిత్ర యూనిట్ సింగర్ మంగ్లీ సెలెక్ట్ చేసుకోవడం విశేషం. పక్కా తెలంగాణ భాషలో మాట్లాడగలిగే ఆ పాత్రకు కరెక్టుగా ఆమెనే సూట్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నారట

ఇక ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. గతంలో ఈ దర్శకుడు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. నానితో కూడా కృష్ణార్జున యుద్ధం అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి అవకాశాలు ఒక్క సారిగా తగ్గిపోయాయి. ఇక నితిన్ అతన్ని పిలిచి అందాదున్ ను రీమేక్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. మరి మెర్లపాక గాంధీ ఈ సినిమాకు ఎంత వరకు న్యాయం చేశాడో రిలీజ్ అనంతరం తెలుస్తుంది.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus