Mohana Bhogaraju: బిగ్ బాస్ 6 అవకాశం అందుకున్న సింగర్ మోహన భోగరాజు?

బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో టెలికాస్ట్ తేదీలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం వచ్చే నెల నాలుగవ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రసారానికి రోజులు దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమం ప్రసార తేదీని కూడా ప్రకటించడంతో ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి అభిమానులు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.సీజన్ సిక్స్ కంటెస్టెంట్లుగా వెళ్ళనున్న వాళ్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా రోజుకు ఒకరి పేరు వినిపించడంతో ఈ కార్యక్రమం పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి ఆదిరెడ్డి, గీతా రాయల్, ఉదయభాను, శ్రీహాన్, సుదీప, టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్, బుల్లితెర నటుడు అమర్ దీప్ వంటి కొందరి పేర్లు వినపడుతున్నాయి.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి సీజన్లోనూ తప్పనిసరిగా సింగర్లు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా సింగర్లను కంటెస్టెంట్ గా పంపిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం బుల్లెట్ బండి పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సింగర్ మోహన భోగరాజు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈమె నేరుగా అయినా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారని లేదంటే వైల్డ్ కార్డు ద్వారా అయినా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈమె బిగ్ బాస్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus