ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లనే జనాలు వింత వింతగా చూస్తుంటారు. ట్రోలర్స్ అయితే వాటి పై మీమ్స్ కూడా వేస్తుంటారు. అలాంటిది వాటికి నెక్స్ట్ వెర్షన్ ల మాదిరి ఈ మధ్యనే డివోర్స్ ఫోటో షూట్లు కూడా వచ్చాయి. ఇక వాటిని కూడా మించి బేబీ బంప్ తో కొంతమంది నటీమణులు మెటర్నిటీ ఫోటోషూట్లు మొదలుపెట్టారు. కొంతవరకు అవి పర్వాలేదు అనుకున్నా.. తాజాగా ఓ సింగర్ మాత్రం బట్టలు లేకుండా బేబీ బంప్ తో ఫోటో షూట్లో పాల్గొని.. విమర్శలు ఎదుర్కొంటుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ స్టార్ సింగర్ కమ్ యాక్ట్రెస్ రాబిన్ రిహన్న ఫెంటీ.. న్యూడ్ ఫోటో షూట్తో అందరికీ షాకిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. మామూలుగానే ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీ టైమ్లో చేసే మెటర్నిటీ ఫోటోషూట్ ఇలా నగ్నంగా చేయాలా? ఈ ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాల్లో కూడా పోస్ట్ చేసింది. ‘మొదటి ప్రెగ్నెన్సీకి గౌరవార్ధం.
(Singer) నా శరీరం చేసిన మ్యాజిక్! బేబీ RZA..కోసం తన అమ్మ ఎంత పిచ్చిగా ఎదురుచూసిందో ఇప్పటికీ తెలియదు’ అంటూ ఈమె రాసుకొచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొందరు విమర్శిస్తుంటే మరికొంతమంది ‘నువ్వొక అద్భుతమైన అమ్మవు. చాలా అందంగా కనిపిస్తున్నావు!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో అమీ జాక్సన్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఫోటో షూట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.