పెళ్లి చేసుకోబోతున్న ‘బాహుబలి’ సింగర్… వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ ఏడాది చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇంకొంతమంది సినీ సెలబ్రటీలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లో సింగర్ సత్య యామిని కూడా చేరింది. యంగ్ సింగర్ సత్య యామిని అందరికీ సుపరిచితమే.పలు సినిమాల్లో అలాగే పలు టీవీ షోలలో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది.ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. ‘బహుబలి'(ది బిగినింగ్) చిత్రంలోని ‘మమతల తల్లి’ అనే పాటతో బాగా పాపులర్ అయ్యింది.

ఆ ఒక్క పాట సత్య జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. బాహుబలి తర్వాత యామినికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘కొండపొలం’,’అఖండ’, ‘రాధేశ్యామ్’, ‘బింబిసార’, వంటి సినిమాల్లో పాటలు పాడి బిజీ సింగర్ గా రాణిస్తుంది. ఇదిలా ఉండగా.. యామిని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పి హాట్ టాపిక్ గా నిలిచింది. అదేంటి.. అంటే త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలక్కబోతుంది.తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

‘జీవిత కాలానికి కావాల్సిన రోలర్ కోస్టర్ రెడీగా ఉంది’ అంటూ తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఆమె పోస్ట్ చూసిన తోటి సింగర్స్ గీతా మాధురి, అనుదీప్, మనీషాల వంటి వారు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సత్య యామిని షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus