Sid Sriram Remuneration: సిద్ శ్రీరామ్ పాట ఖరీదు అన్ని లక్షలా?

  • April 12, 2022 / 10:50 AM IST

తెలుగులో ఎంతమంది సింగర్లు ఉన్నా సిద్ శ్రీరామ్ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన పాటలలో మెజారిటీ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆ పాటలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. పెద్ద సినిమాల నిర్మాతలతో పాటు చిన్న సినిమాల నిర్మాతలు సైతం తమ సినిమాలలో సిద్ శ్రీరామ్ ఒక్క పాటైనా పాడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సిద్ శ్రీరామ్ తన రెమ్యునరేషన్ ను అంతకంతకూ పెంచేస్తున్నారని తెలుస్తోంది.

ఒక్క సాంగ్ కు సిద్ శ్రీరామ్ ఏకంగా ఆరు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ రెమ్యునరేషన్ తో పాటు నిర్మాతే జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉందని సమాచారం. నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కు ఇచ్చే బడ్జెట్ లోనే సిద్ శ్రీరామ్ పాట కచ్చితంగా ఉండాలని షరతు విధిస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా కోసం ఎంత కష్టపడినా ఎక్కువ మొత్తం మిగలడం లేదని బోగట్టా.

కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలలో పాటలు పాడటానికి సిద్ శ్రీరామ్ ను తీసుకోవాలని షరతులు విధిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాట హిట్టైతే బాగానే ఉన్నా పాట ఆకట్టుకోలేకపోతే మాత్రం ఆ పాట వైరల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సిద్ శ్రీరామ్ అంతకంతకూ రెమ్యునరేషన్ ను పెంచుతుండటంతో అయన భవిష్యత్తుపై రెమ్యునరేషన్ ప్రభావం పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సిద్ శ్రీరామ్ పాటలు హిట్ కాకపోతే మాత్రం భవిష్యత్తులో ఆయన కెరీర్ కు ఇబ్బందులు తప్పవు. సిద్ శ్రీరామ్ భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, నిర్మాతలు సిద్ శ్రీరామ్ ను సెంటిమెంట్ గా పరిగణించి అతనికి అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. మరోవైపు కొంతమంది సింగర్లు సిద్ శ్రీరామ్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus