Singer Smitha: పాత ఫోటోని షేర్ చేసి స్మితని టార్గెట్ చేస్తున్నారుగా

పాప్ సింగర్ గా కెరీర్ ను ప్రారంభించి బాగా పాపులర్ అయ్యారు స్మిత.ప్రైవేట్ ఆల్బమ్స్ కు ఇక్కడ అంత మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది స్మిత అనడంలో అతిశయోక్తి లేదు. నిజానికి ఈ వీడియోలు చేస్తాను అని ఆమె అన్నప్పుడు.. విమర్శలు చేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పైగా పాత పాటలనే రీమిక్స్ చేసి ప్రైవేట్ ఆల్బమ్స్ గా చూడమంటే ఎవరు చూస్తారు అని కూడా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈమె అటెంప్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది.

‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. స్మిత ఇప్పుడు ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.సోనీ లీవ్ వేదికగా ‘నిజం విత్ స్మిత’ పేరుతో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలను, ఎపిసోడ్ లను చాలా ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నారు. ఈ షోకు చిరంజీవి, చంద్రబాబు నాయుడు, రాధిక వంటి సీనియర్ స్టార్లు ఎంతో మంది ఈ షోలో పాల్గొంటున్నట్టు ప్రోమో స్పష్టం చేసింది.

చిరంజీవి ఎపిసోడ్ తో ఈ షోకి సూపర్ క్రేజ్ లభించింది. అయితే స్మితకు సంబంధించిన ఓ పాత ఫోటోతో ఈ షోకి రాజకీయ రంగు పులమాలని కొందరు చూస్తున్నట్టు తెలుస్తుంది . ఇక ఈ పాత ఫోటో లో స్మిత తెలుగుదేశం పార్టీ తరపున అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది.

ఈ క్రమంలో కార్యకర్తలతో స్మిత ఫోటో దిగినట్టు తెలుస్తుంది.కాబట్టి చంద్రబాబు నాయుడు కి కలిసొచ్చే విధంగా ఆయన ఇంటర్వ్యూని చిత్రీకరించి ఉంటారు అని కొంతమంది టీడీపీ అంటే పడని వారు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus