‘నా ప్రాణం తనలో ఉంది’ అంటూ కుమార్తె శివి గురించి స్మిత చెప్పిన ఆసక్తికర విషయాలు..

  • February 10, 2023 / 08:37 PM IST

సింగర్ స్మిత.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేని పేరు.. ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్, యాక్ట్రెస్, హోస్ట్ అండ్ బిజినెస్ వుమెన్‌గా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో రాణించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారామె. అలాగే తమ స్వశక్తితో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. విజయవాడకు చెందిన స్మిత 1997లో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ‘పాడుతా తీయగా’ తో సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె రూపొందించిన ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తెలుగులో, ఆ జనరేషన్‌లో ఫస్ట్ పాప్ సింగర్ స్మితనే కావడం విశేషం.. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ మూవీతో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడలోనూ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు. ఛార్మీ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రంలో పాడిన ‘ఎవరైనా చూస్తుంటారా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అందుకున్నారామె..కొంత గ్యాప్ తర్వాత ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 10 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షోలో పాపులర్ సినీ, పొలిటికల్ అండ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ని ఇంటర్వూ చేయబోతున్నారు స్మిత..

ఆమె అందర్నీ ఇంటర్వూ చేస్తుంటే.. ఆ షో గురించి, తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ గురించి ఫిల్మీ లుక్స్ స్మితను ఇంటర్వూ చేసింది.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారామె.. ఫ్యామిలీ గురించి అడగ్గా.. ‘‘నా జీవితంలో అంత బందిపోటు రహస్యాలేమీ లేవు.. ఫ్యామిలీలో అంతా సింపుల్ పీపుల్.. లవింగ్, కేరింగ్.. అందరం కష్టపడతాం.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం.. చాలా ఫ్రీడమ్ ఇస్తాం.. నాకన్నీ నా కూతురే’’.. అని చెప్పారు..

అలాగే తన జీవితంలో జరిగిన అద్భుతం అంటే.. పాప శివి పుట్టడమేననీ.. ‘మహానటి’ లో తనను బాలనటిగా పరిచయం చేయడానికి గల కారణాలు చెప్పారు.. శివి ఫోకస్ అంతా మ్యూజిక్ మీదనే ఉందన్నారు. అలాగే షోకి వచ్చిన చంద్రబాబు నాయుడులో మరో కోణాన్ని చూస్తారనీ, చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌తో పాటు.. పొలిటికల్ అనుభవాల గురించి కూడా తన షోలో ఉండబోతున్నట్లు చెప్పారు.. రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని కూడా చాలా చక్కగా విడమర్చి చెప్పారు స్మిత..

తనకు నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అని.. ఇక ఇండస్ట్రీ విషయానికొస్తే సుబ్బరాజు, నాని, నాని వైఫ్, డైరెక్టర్ దేవ కట్టా తన స్నేహితులని.. సింగింగ్ కెరీర్ స్టార్టింగ్ నుండే అల్లరి నరేష్ ఫ్రెండ్ అని.. నరేష్ భార్య.. తన అమ్మ, నాన్న వైపు నుండి కూడా రిలేటివ్ అవుతారని చెప్పుకొచ్చారు స్మిత..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus