Sunitha, Suma: సుమ బాటలోనే సునీత.. కొడుకుల సినీ కెరీర్ పై స్పెషల్ ఫోకస్ కానీ..!

టాలీవుడ్లో స్టార్ యాంకర్ ఎవరు అనే ప్రశ్న ఎదురైతే.. మన మైండ్లోకి వచ్చే మొదటి పేరు సుమ కనకాల అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ సినిమా ప్రమోషన్ అయినా అది సుమ దగ్గరనుండే మొదలవ్వాలి. పెద్ద దర్శకులు,నిర్మాతలు … తమ సినిమా ఈవెంట్లకి సుమనే కావాలని పట్టుబడతారు అంటే ఆమె.. రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క బుల్లితెరపై కూడా సుమ బోలెడన్ని షోలని హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఇదిలా ఉండగా.. సుమ ఫోకస్ ఇప్పుడు తన కొడుకు సినీ కెరీర్ పై మళ్లింది.అవును సుమ కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఆ సినిమా యూనిట్ మాత్రమే కాకుండా సుమ కూడా ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తుంది. సుమ కనకాల హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.

కొంత గ్యాప్ తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ తో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా సక్సెస్ దక్కలేదు. దీంతో బుల్లితెరపైనే షోలు చేసుకుంటుంది. భర్త రాజీవ్ కనకాల ఎలాగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యాడు. అందుకే, తన కొడుకుని హీరోగా నిలబెట్టాలి అని గట్టి ప్రయత్నాలే చేస్తుంది.

సుమ మాత్రమే కాదు స్టార్ సింగర్ (Sunitha) సునీతది కూడా అదే పరిస్థితి. సునీత రెండో పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమె కొడుకు, కూతురు పెద్దవాళ్ళు అయ్యారు. ముఖ్యంగా ఆమె కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టాలని ఆమె గట్టి ప్రయత్నాలు చేసింది.ఈ క్రమంలో ‘సర్కార్ నౌకరి’ లో అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. దీంతో సునీత కూడా తన వంతు ప్రమోషన్ చేస్తూ బిజీగా గడుపుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags