Sunitha: ఇంస్టాగ్రామ్ కోసం అలాంటి వీడియోలను చేస్తున్న సునీత?

  • August 28, 2022 / 09:43 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె ప్లే బాక్ సింగర్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా సునీత ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే సునీత రెండవ వివాహం చేసుకున్న తర్వాత మొదట్లో పలు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి. రెండవ వివాహం తర్వాత సునీత తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా సునీత ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని చేస్తూ తాను ఇంస్టాగ్రామ్ కోసం వన్ మినిట్ మ్యూజిక్ వీడియో చేస్తున్నానని వెల్లడించారు.వన్ మినిట్ మ్యూజిక్ వీడియో ఈరోజు చేశానని, ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సునీత వెల్లడించారు.

ఇలా సునీత ఇకపై వన్ మినిట్ మ్యూజిక్ వీడియోల ద్వారా సోషల్ మీడియా అభిమానులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక సునీత రెండవ వివాహాన్ని తన స్నేహితుడు మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వివాహం తర్వాత సునీత తన జీవితంలో చాలా సంతోషంగా గడుపుతుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus