Singer Sunitha: హాట్ టాపిక్ గా మారిన సునీత కొడుకు ‘సర్కారు నౌకరి’ సినిమా ఫస్ట్ లుక్!

సింగర్ సునీత అందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన పాటలతో మన మనసులు దోచుకుందామె. లాక్ డౌన్ టైంలో ఈమె రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ‘మ్యాంగో మీడియా’ అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అతని పేరు ఆకాష్.

‘సర్కారు నౌకరి’ అనే చిత్రంతో అతను హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.

సురేష్‌ బొబ్బిలి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ పై (Singer Sunitha) సునీత స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్ ఆకాష్ .. ఈరోజు ఓ తల్లి, కొడుకు కల నెరవేరింది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడానికి రెడీ అయ్యావు. నటుడు కావాలనే కలని సాకారం చేసుకోవడానికి నువ్వు పడిన శ్రమ, వృత్తి పట్ల నిబద్దత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ తన కొడుక్కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus