Siri, Shanmukh: షణ్ముక్ ఇంకా సిరి దానివల్లే తక్కువైపోయాం అని ఫీల్ అయ్యారా..?

  • December 12, 2021 / 01:07 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున శనివారం హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించాడు. ఇందులో ఒక గడియారాన్ని పెట్టి అందులో ఫస్ట్ నుంచీ ఇప్పటివరకూ వీక్స్ ని ఉంచి, మీరు ఏ వీక్ లో వెనక్కి వెళ్లి రిగ్రేట్ అవ్వాలని అనుకుంటున్నారు అంటూ టాస్క్ లాగా ఇచ్చాడు. దీంతో ఒక్కో హౌస్ మేట్ హౌస్ లో తము పశ్చాత్తాపం చెందే సంఘటనలని వివరించారు. ఫస్ట్ కాజల్ 9వ వారం నామినేషన్స్ అప్పుడు జైల్లో తన ఫ్రెండ్స్ ని ఎందుకు సేవ్ చేయలేకపోయానా అని బాధపడ్డాను అని చెప్పింది.

అంతేకాదు, ఇక్కడే శ్రీరామ్ వచ్చి చెప్తేనే నాకు పే బ్యాక్ ఇవ్వాలి అని తెలిసిందని, అందుకే షణ్ముక్ ని సేఫ్ చేసి రీజన్ చెప్పానని అన్నది. కానీ, షణ్ముక్ కి అది నచ్చలేదని నేను మనస్పూర్తిగా ఇవ్వలేదని అనుకున్నాడని చెప్పింది. దీనికి నేను రిగ్రేట్ అవుతున్నాను అని కన్ఫెషన్ రూమ్ లో నాగార్జనకి చెప్పింది. ఇలా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి మరీ తము రిగ్రేట్ అవ్వాలని అనుకున్న సంఘటనలని వివరించారు. ఇక్కడే షణ్ముక్ ఇంకా సిరి ఇద్దరూ కూడా 11వ వారం ఇన్సిడెంట్ గురించే మాట్లాడారు.

హౌస్ లో వీళ్లిద్దరూ వాష్ రూమ్ లోకి వెళ్లి మరీ గొడవపడ్డారు. ఇద్దరికీ క్లాష్ అయ్యింది. దీంతో సిరి వెళ్లి వాష్ రూమ్ లో గోడకి తల కొట్టుకుని మరీ ఏడ్చింది. వీకండ్ నాగార్జున ఇద్దరికీ ఫుల్ క్లాస్ పీకాడు. గేట్స్ తెరిచి మరీ వెళ్లిపోమని చెప్పాడు. ఈవిషయాన్ని ఇద్దరూ ఇంకా మర్చిపోలేదు. అందుకే, ఇద్దరూ కలిసి ఇదే సంఘటనని చెప్పారు. షణ్ముక్ నేను అలా అరిచి ఉండకూడదని అంటే,

సిరి నేను సెల్ఫ్ హర్టింగ్ చేస్కోవడం నాకు నచ్చలేదని, నేను ఇంకెప్పుడు అలా చేసుకోను అని నాగార్జునకి ప్రామిస్ చేసింది. కేవలం ఈ సంఘటన కారణంగానే సిరి – షణ్ముక్ గ్రాఫ్ పడిపోయిందని వాళ్లకి అర్ధమైంది. ఇద్దరూ ఇప్పుడు టాప్ 5 రేసులో ఉన్నారు కాబట్టి మరి ఏ పొజీషన్స్ కి వెళ్తారు. టైటిల్ విన్నర్స్ గా నిలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదీమేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus