Siri Eliminated: సడన్ గా బిగ్ బాస్ టీమ్ సిరిని ఎందుకు ఎలిమినేట్ చేసింది..?

బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతోందా అంటే అవుననే న్యూస్ అందుతోంది. ప్రస్తుతం టాప్ 5 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఇందులో భాగంగా అన్ అఫీషియల్ ఓటింగ్ చూసినట్లయితే సిరి టేబుల్ లో బోటమ్ లో ఉంది. ఆ తర్వాత మానస్ ఉన్నారు. వీరిద్దరిలోనే ఫస్ట్ ఎలిమినేషన్ అనేది జరగబోతోందని అందరూ ఊహించినదే. అయితే, ఈసారి ఫినాలే స్టేజ్ పైన కాకుండా ముందుగానే బిగ్ బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి మనం చూసినట్లయితే, ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో సిరిని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇది కంప్లీట్ గా ఫేక్ ఎలిమినేషన్. ఒక గంట పాటు సీక్రెట్ రూమ్ లో పెట్టి సిరికి హౌస్ లో హౌస్ మేట్స్ రియాక్షన్స్ ని చూపించి పంపించేసినట్లుగా సమాచారం. అయితే, సన్నీకి సిరికి రోప్స్ టాస్క్ విషయంలో గట్టిగా వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ మాటకి మాట అనుకుని నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు.

నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా అంటూ సిరి ఫుల్ రెచ్చిపోయి మరీ సన్నీపై అరిచింది. సన్నీ కూడా గట్టిగట్టిగా సిరిపై అరిచాడు. మానస్ వచ్చి సన్నీని పక్కకి తీస్కుని వెళ్లాడు. సన్నీ నవ్వుతుంటే, నవ్వకు అస్సలు చూడలేకపోతున్నామ్ అంటూ మళ్లీ రెచ్చగొట్టింది సిరి, పక్కనే ఉన్న షణ్ముక్ వీరిద్దరి ఆర్గ్యూమెంట్ వింటూ ఉండిపోయాడు. సిరిని వారిస్తున్నా కూడా రెచ్చిపోయి మరీ అరిచింది సిరి. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడు అనగానే ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోయారు.

నిజంగా హౌస్ మేట్స్ అందరూ ఇది నిజమైన ఎలిమినేషన్ అనే అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఒక గంట తర్వాత ట్విస్ట్ ఇచ్చాడు. సిరిని మళ్లీ హౌస్ లోకి పంపిస్తూ ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక హౌస్ లో మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది జ్యోతిష్యుడు ద్వారా జ్యోతిష్యం చెప్పించబోతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

[yop_poll id=”7″]

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus