Siri Hanmanth: అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చిన సిరి హనుమంత్

‘బిగ్ బాస్’ సీజన్ 5 లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది…హౌస్ లో మొదటి కెప్టెన్ అయ్యి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యింది సిరి హనుమంత్. నిజానికి ఈమె బిగ్ బాస్ కు రాకముందు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు అని చెప్పడంలో విచిత్రం ఏమీ లేదు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలు పెట్టిన సిరి ఆ తర్వాత వెబ్ సిరీస్, సీరియల్స్ వంటి వాటిలో నటించింది. యూట్యూబ్ లో ఈమె ఛానల్ కు గాని అలాగే ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి గాని ఫాలోవర్స్ ఎక్కువ మందే ఉన్నారు.

ఇదిలా ఉండగా… ఈమె పర్సనల్ లైఫ్ గురించి కూడా జనాలకు ఎక్కువ మందికి తెలీదు. ఇదిలా ఉండగా.. ఈమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అలా అని కంగారు పడి ఆమెను తప్పు పట్టాల్సిన పని ఏమీ లేదు. సిరి హ‌న్మంత్‌కు మరో యూట్యూబర్ శ్రీహాన్‌తో ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ అయ్యింది. వీళ్ళు చాలా వెబ్ సిరీస్ లలో కలిసి నటించారు.వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అందుకే పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

అయితే అనూహ్యంగా సిరికి బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో.. వీరి పెళ్ళి వాయిదా పడింది. బిగ్ బాస్ అనేది సిరికి రెండు విధాలుగా చాలా అవసరం.ఒకటి ఆమె క్రేజ్ కోసం అలాగే ఆమె పెళ్ళికి అవసరమయ్యే డబ్బు కోసం. అందుకే ఆమె తన పెళ్లిని వాయిదా వేసింది. అయితే ఆమె తల్లి అవ్వడం ఏంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. సిరి, శ్రీహాన్ లు ఓ బాబుని దత్తత తీసుకున్నారు. చైతూ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ను వారు దత్తత తీసుకున్నట్టు సిరి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇది సిరిని మెచ్చుకోదగ్గ విషయమే..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus