Bigg Boss 5 Telugu: సిరి టీషర్ట్ లో సన్నీనిజంగానే చేయి పెట్టాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అనేది చాలా రసవత్తరంగా మారింది. రెండోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా ‘పంతం నీదా నాదా సై’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈటాస్క్ ఏంటంటే, పంతం నీదా నాదా సై అనేది టాస్క్. ఇందులో భాగంగా మళ్లీ కొన్ని టాస్క్ లు ఉంటాయని, ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం హౌస్ మేట్స్ ఫస్ట్ ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్ ఆడాలి. ఇక్కడ రెండు టీమ్స్ కి సంబందించిన డగౌట్స్ ఉన్నాయి. అంటే సర్కిల్స్ వాళ్ల ప్లేస్ లు ఉన్నమాట. అక్కడ ఉల్ఫ్ టీమ్ లో వచ్చేసి ఈగల్ టీమ్ బాటన్స్ ఉంటాయి.

అంటే సింపుల్ గా పిల్లోస్ లాంటివి అనుకోండి., అలాగే ఈగల్ టీమ్స్ లో వచ్చేసి ఉల్ఫ్ కి సంబంధించిన బాటెన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అపోజిట్ టీమ్ వాళ్ల బాటెన్స్ తెచ్చుకుని డగౌట్స్ లో పెట్టుకుని మాత్రమే వాటిని కాపాడుకోవాలి. అలాగే ఒకటీమ్ దగ్గరున్న బాటిన్స్ వేరే టీమ్ వాళ్లకి దొరకక్కుండా చూస్కోవాలి. ఈ ప్రక్రియలో బాటన్స్ చిరిగిపోయినా లేదా డ్యామేజ్ అయినా అవి కౌంటబుల్ కాదు. ఏ టీమ్ దగ్గర ఎక్కువ బాటిన్స్ ఉంటాయో వాటినే ఫ్లాగ్స్ లా లెక్కిస్తారు. ప్రతి టాస్క్ గెలిచాక గెలిచిన టీమ్ కి ఒక ఫ్లాగ్ వస్తుంది. అలా ఎవరి టీమ్ బాటన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్లకి ఫ్లాగ్ వస్తుంది. అలా గెలిచిన టీమ్ నుంచీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక అవుతారు. ఇది టాస్క్.

ఇక్కడ ఈగల్ టీమ్ లో ఉన్న సిరి రెచ్చిపోయి మరీ టాస్క్ ఆడింది. గార్డెన్ ఏరియాలో సిరి సన్నీ చేతికి చిక్కింది. సన్నీ సిరి దగ్గరున్న బ్యాటన్ ని తన టీషర్ట్ లో ఉండే గుంజుకోవాలని ట్రై చేశాడు. కానీ అమ్మాయి కాబట్టి టీషర్ట్ లో చేతులు పెట్టకూడదని, అక్కడున్న శ్వేతాని గట్టిగా పిలిచాడు. దీంతో ఉల్ఫ్ టీమ్ నుంచీ శ్వేత ఇంకా కాజల్ ఇద్దరూ వచ్చారు. అలాగే సిరికి సపోర్టింగ్ గా షణ్ముక్ కూడా వచ్చాడు. ఇక్కడే శ్వేతా సిరి టీషర్ట్ పైకి ఎత్తి బ్యాటెన్ ని గుంజుకునే ప్రయత్నం చేసింది. సన్నీ సిరి చేతులు గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఈ ఫైట్ అయిపోయిన తర్వాత పైకి లేచిన సిరి సన్నీపై నిందవేసింది.

టీషర్ట్స్ లో చేతులు పెట్టి ఆడతారా అని మాట్లాడింది. అంతేకాదు, అక్కడే ఉన్న షణ్ముక్ కూడా మరీ బనీన్ లో చేతులుపెట్టి ఎలా ఆడతారు బ్రదర్ అంటూ మాట్లాడాడు. కానీ, అక్కడ సన్నీ అప్పటికే వాష్ రూమ్ దగ్గరకి వెళ్లిపోయాడు. ఈ మాటలు వినలేదు. తర్వాత విశ్వ సన్నీకి చెప్పాడు. దీంతో సన్నీ వచ్చి సిరిని డైరెక్టర్ గా నీ టీషర్ట్ లో నేను చేయి పెట్టానా.. చెప్పూ అంటూ సూటిగా అడిగాడు. ఇప్పుడు నేను నీతో ఆర్గ్యూ చేయను కెెమెరాలు ఉన్నాయి అవి చూస్కుంటాయాని చెప్పింది సిరి. అయితే, అక్కడ క్లియర్ గా సన్నీ సిరి చేతులు మాత్రమే వెనక్కిలాగాడు. అక్కడికి వచ్చిన శ్వేతా సిరి టీషర్ట్ లో చేతులు పెట్టి బ్యాటన్ ని లాగే ప్రయత్నం చేసింది. మరి దీనిపై వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus