మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి (Dulquer Salmaan) తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో అతను చేసిన ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. మృణాల్ రాకూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రష్మిక మందన (Rashmika Mandanna) , సుమంత్ (Sumanth) ,భూమిక (Bhumika Chawla) వంటి వారు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు.
2022 ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో 2 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 10.06 cr |
సీడెడ్ | 1.98 cr |
ఉత్తరాంధ్ర | 3.60 cr |
ఈస్ట్ | 2.03 cr |
వెస్ట్ | 1.30 cr |
గుంటూరు | 1.70 cr |
కృష్ణా | 1.80 cr |
నెల్లూరు | 0.92 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 23.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.92 cr |
ఓవర్సీస్ | 7.30 cr |
మిగిలిన వెర్షన్లు | 8.28 cr |
హిందీ | 4.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 46.19 cr |
‘సీతా రామం’ చిత్రం రూ.17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.46.19 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.29.19 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.