మహేష్ చెవిలో సితార ఏమి చెప్పింది ?
- June 23, 2017 / 12:54 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫిషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో పర్సనల్ లైఫ్ కి అంతే విలువ ఇస్తారు. పెళ్లి అయినప్పటి నుంచి.. భార్య, పిల్లలకి క్వాలిటీ టైమ్ కేటాయిస్తుంటారు. గౌతమ్ స్కూల్ కి సెలవులు ఇస్తే చాలు విహార యాత్రను ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్య స్పైడర్ షూటింగ్ లో గ్యాప్ దొరకడంతో మహేష్ భార్య, పిల్లల్తో కలిసి లండన్ టూర్ వెళ్లారు. అక్కడ చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడు సితారతో మహేష్ సరదాగా ఉన్న క్షణాలను నమ్రత కెమెరాలో బంధించింది. తాజాగా వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో నాన్న మహేష్ చెవిలో సీక్రెట్ చెప్పేస్తున్న సితార క్యూట్ గా కనిపిస్తోంది.
ఏం విషయం చెబుతుందో కానీ, మహేష్ కూడా భలే నవ్వుతున్నాడు. అదే సోఫాపై దగ్గరలో కూర్చున్న గౌతమ్.. స్మార్ట్ ఫోన్ తో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో మహేష్ మూవీ ఫస్ట్ లుక్ మాదిరిగా లైక్లు, షేర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఫోటోని చూసిన తర్వాత మీరుకూడా అంటారు.. ఇది సినిమా స్టిల్ కంటే చాలా బాగుందని.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












