బుల్లితెరపై కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతూ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలోనే అనామిక అడ్రస్ తెలుసుకున్నటువంటి కళ్యాణ్ తనని కలవడం కోసం కాఫీ షాప్ దగ్గరకు వెళ్తారు. అయితే అనామిక మాత్రం బయటకు రాకుండా తన అసిస్టెంట్స్ అందరిని కూడా ఒక్కొక్కరిని కళ్యాణ్ దగ్గరకు పంపిస్తూ తనకు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు. అనామిక వస్తుంది అనుకుంటే ఎవరెవరో వస్తున్నారు అంటూ కళ్యాణ్ కూడా ఆలోచిస్తూ ఉంటారు.
మరోవైపు సీతారామయ్య రాజ్ ను తన వద్దకు పిలిపించుకుంటారు. ఏంటి తాతయ్య అని రాజ్ అనడంతో నేను నీతో మాట్లాడాలి ఈ విషయం నలుగురిలో మాట్లాడేది కాదు అంటూ కావ్య గురించి తన దగ్గర ప్రస్తావనకు తీసుకు వస్తారు. నీ సంసారం గురించి నాకు మీ నాన్నమ్మకు చాలా భయంగా ఉంది ఇప్పటివరకు కావ్యను నువ్వు భార్యగా అంగీకరించలేదు ఆ అమ్మాయి చాలా మంచిది. ఏ విషయంలోనూ మన దగ్గర అబద్ధం చెప్పలేదు. నీ వెనుక ఇంత డబ్బు ఉన్న ఆ డబ్బుకు ఆశపడకుండా తన స్వసక్తితో తన తల్లిదండ్రులకు సహాయం చేయాలి అనుకుంటుంది.
భార్య భర్తలు అన్న తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడం సాధారణ అయితే అవి అప్పటికే మర్చిపోవాలి అని తనకు అర్థం అయ్యేలా వివరిస్తారు. ఎంతో గొప్ప మంచి మనసు వ్యక్తిత్వం ఉన్నటువంటి అమ్మాయిని నువ్వు భార్యగా అంగీకరించలేకపోతున్నావు ఆ అమ్మాయి ఇంట్లో అందరికీ మంచిగా ఉండి నీకు మీ అమ్మకు మాత్రమే చెడుగా కనిపిస్తోంది. ఒకసారి నీ భార్య మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అంటూ రాజ్ కు సీతారామయ్య అర్థమయ్యేలా తెలియచేస్తారు.
మరోవైపు అనామిక కళ్యాణ్ వద్దకు రావడంతో ఆమెను చూసి కళ్యాణ్ ఫ్రీజ్ అవుతారు. ఏంటి అలా అయిపోయారు. ఇన్నాళ్లు నాకోసం ఎదురు చూసి ఇప్పుడు నేను కనిపించేసరికి ఇలా అయిపోయారు నేనే అనామిక అని ఎలా గుర్తుపట్టారు అని అడగడంతో కవిగా ఆ మాత్రం గుర్తుపట్టకపోతే ఎలా అంటూ తన కోసం తెచ్చినటువంటి ఒక వాచ్ తనకు గిఫ్టుగా ఇస్తారు. ఇలా వీరిద్దరూ స్నేహితులుగా పరిచయం చేసుకుంటారు కళ్యాణ్ అనామికతో మాట్లాడుతూ ఉండగా అప్పు తనకు ఫోన్ చేస్తుంది. అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కళ్యాణ్ తనని అవాయిడ్ చేస్తారు. అనామిక ఇంపార్టెంట్ కాల్ ఏమో మాట్లాడండి అనడంతో అంత ఇంపార్టెంట్ కాదు అంటూ కళ్యాణ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.
ఈ విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో వీడికి అవసరమైన ప్రతిసారి నేను వెళ్లాను కానీ నాకు అవసరమై ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు రాని సంగతి చెప్తా అంటుకోపడుతూ ఉంటుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా చిట్టి రేపు వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుతూ నా కోడలు వచ్చిన తర్వాత నేను ఆ బాధ్యతలను అపర్ణకు ఇచ్చాను. ఇప్పుడు ఆ బాధ్యత తన కోడలు కావ్య తీసుకుంటుంది రేపు వరలక్ష్మి వ్రతం తానే చేస్తుంది అనడంతో కావ్య పర్వాలేదు అమ్మమ్మ గారు అత్తయ్య గారే పూజ చేయనివ్వండి నేను చిన్న అత్తయ్య గారు తనకు సాయం చేస్తాము అని చెబుతుంది.
నా కోడలు నా మాట వినడం లేదు ఇప్పుడు నువ్వు వినడం లేదు ఇలాగైతే మేము కాశి యాత్రలకు వెళ్లిపోతాము అంటూ చిట్టి మాట్లాడటంతో కావే తప్పనిసరి స్తుతులలో ఒప్పుకుంటుంది అనడంతో కడుపుతో ఉన్నవారు వరలక్ష్మి వ్రతం చేయకూడదని చిట్టి చెబుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి కాగా తరువాయి భాగంలో వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తాను అంటూ మాట్లాడుతారు ఏమిస్తారు అంటూ కావ్య అనడంతో జస్ట్ వెయిట్ అండ్ సి అంటూ సీరియస్ గా వెళ్తారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!