‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లైనప్ మామూలుగా లేదుగా..!

ఈ లాక్ డౌన్ టైములో ఎలాగూ కొత్త సినిమాల షూటింగ్ లు మొదలు పెట్టే అవకాశం లేదు. ఇక థియేటర్లు కూడా మూతపడ్డాయి కాబట్టి.. దర్శకనిర్మాతలు తమ కొత్త ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టుకునే పనుల్లో పడ్డారు. ఈ క్రమంలో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ అధినేత సూర్య దేవర నాగ వంశీ ఓ సరికొత రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. ఈ ఏడాది నితిన్ ‘భీష్మ’ తో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్.. మళ్ళీ అదే హీరోతో ‘రంగ్ దే’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘తొలిప్రేమ'(2018) ఫేం వెంకీ అట్లూరి దర్శకుడు.

ఇక ఈ చిత్రంతో పాటు నాగ శౌర్య హీరోగా సౌజన్య డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియం’ మరియు ‘కప్పెల’ చిత్రాల రిమేక్ హక్కులను కొనుగోలు చేశాడు.’అయ్యప్పన్ కోషియం’ చిత్రాన్ని రవితేజ మరియు రానా లతో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక నానితో ‘శ్యామ్ సింగ రాయ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేం సిద్దు జొన్నల గడ్డతో ఓ సినిమా అలాగే..

దర్శకులు మారుతీ, గౌతమ్ తిన్ననూరి, సుధీర్ వర్మ, కిశోర్ తిరుమల, శైలేష్ కొలను, వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర వంటి యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చెయ్యడానికి కూడా రెడీ అయిపోయాడట. ఆల్రెడీ వాళ్ళకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసాడట. దాంతో పాటు స్క్రిప్ట్ కు సంబందించి డిస్కషన్లు చెయ్యడం కూడా జరిగిపోయాయని సమాచారం.ఏమైనా ఈ యంగ్ ప్రొడ్యూసర్ దూకుడు మామూలుగా లేదనే చెప్పాలి.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus