అదిరిపోయే టైటిల్‌ కూడా రెడీ చేశారట

Advertisement

ఇతర ‘వుడ్‌’లలో హిట్‌ సినిమా పడితే చాలు… రీమేక్‌ రైట్స్‌ కోసం ముందుండే నిర్మాతల్లో టాలీవుడ్‌ ముందుంటోంది. ఇటీవల తెలుగులో కి వస్తున్న రీమేక్‌ల జోరు చూస్తే ఇదే అనిపిస్తోంది. అలా రీమేక్‌ రైట్స్‌ కొనే నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ కూడా ఉంటుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంలో చాలా స్పీడ్‌ అని టాక్‌. ఈ జోరులో మరో మలయాళ సినిమా హక్కుల్ని ఇటీవల చేజిక్కించుకున్నారట. అంతేకాదు ఆ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ కూడా సిద్ధం చేశారట.

తెలుగులో ఇటీవల రీమేక్‌ల పరంపర చూస్తే… మలయాళ సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ – రానాతో రీమేక్‌ చేస్తోంది సితార ఎంటర్‌టైన్మెంట్స్‌. మరోవైపు మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌’ను చిరంజీవి రీమేక్‌ చేస్తున్నారు. మరోవైపు మలయాళ సూపర్‌ హిట్‌ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ హక్కుల్ని రామ్‌చరణ్‌ రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. రవితేజ, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఆ సినిమా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల మాలయాళంలో విజయవంతమైన ‘కప్పెల’ సినిమా హక్కుల్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అన్నే బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ నటించిన చిత్రమిది. మలయాళంలో మంచి వసూళ్లు, ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారట ‘సితార’ నాగవంశీ. దీనికి ‘బుట్టబొమ్మ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus